ఆంధ్రప్రదేశ్‌కు 'స్టేట్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం

- February 28, 2017 , by Maagulf
ఆంధ్రప్రదేశ్‌కు 'స్టేట్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం

ఆంధ్రప్రదేశ్‌కు 'స్టేట్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం దక్కింది. సీఎన్‌బీసీ టీవీ18 అందించే ఇండియా బిజినెస్‌ లీడర్‌ అవార్డుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్టాత్మక 'స్టేట్‌ ఆఫ్‌ ద ఇయర్‌' పురస్కారం లభించింది. బ్యాంకింగ్‌, పారిశ్రామిక రంగాల జాతీయస్థాయి ప్రముఖుల జ్యూరీ ఈ అవార్డుకు ఏపీని ఎంపిక చేసింది. మార్చి 23న పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన పురోగతిని పరిగణనలోకి తీసుకుని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. కాగ, ఆంధ్రప్రదేశ్‌కు 'స్టేట్‌ ఆఫ్‌ ద ఇయర్‌' అవార్డు రావడం పట్ల ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ హర్షం వ్యక్తం చేశారు.అభివృద్ది, టెక్నాలజీ వినియోగం, సమర్థ నాయకత్వం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేసినట్లు భావిస్తున్నట్లు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com