ఆటకు గుడ్ బై చెప్పిన సారా

- March 01, 2017 , by Maagulf
ఆటకు గుడ్ బై చెప్పిన సారా

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌ సారా కాయ్‌టీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు ఆమె గుడ్‌బై చెప్పారు. సుమారు సంవత్సరం క్రితం నుంచి ఆమె క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా 25ఏళ్ల సారా క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. తన కెరీర్‌లో మొత్తం 30వన్డేలు, 46 టీ20లు, నాలుగు టెస్టులు ఆడారు.
ఈ సందర్భంగా క్రికెట్‌ ఆస్ట్రేలియా బోర్డు సభ్యులు ఆమె సేవలను కొనియాడారు. ఆమె అందించిన సేవలు మరువలేనివని బోర్డు సీఈవో జేమ్స్‌ సుదర్‌లాండ్‌ అన్నారు. ఐసీసీ ఉమెన్స్‌ టీ20 ప్రపంచకప్‌ సాధించిన ఆస్ట్రేలియా జట్టులో సారా సభ్యురాలు.
2015లో ఇంగ్లాండ్‌లో జరిగిన యాషెస్‌ సిరీస్‌లోనూ ఆమె అద్భుత ప్రదర్శన కనపరిచారని జేమ్స్‌ గుర్తు చేసుకున్నారు.
సిడ్నీ వెళ్లి నా కుటుంబానికి దగ్గరవ్వాలని అనుకుంటున్నాను. ఆట వల్ల నా కుటుంబాన్ని ఎంత కోల్పోతున్నానన్న విషయం చాలా ఆలస్యంగా అర్థమైంది. న్యూ సౌత్‌ వేల్స్‌ జట్టుకు ఆడాలన్న ఆలోచన లేదు. మొత్తం సమయాన్ని నాకు, నన్ను ప్రేమించే వారికే కేటాయిస్తాను అని చెప్పింది సారా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com