"వెజిటబుల్ మసాలా టోస్ట్"

- September 22, 2015 , by Maagulf

ఇవాళ చక చక తయారయ్యే ఒక టిఫిన్ చూద్దాం..పిల్లలకి మరియు పెద్దలకి కూడా నచ్చే ఒక చక్కని వంటకం.. "వెజిటబుల్ మసాలా టోస్ట్"

 

కావలసిన పదార్ధాలు:

  • బ్రెడ్                       - 4
  • క్యారట్    - 1
  • క్యాప్సికం              - 2
  • ఉల్లిపాయలు         - 2 పెద్దవి
  • నూనె                    - 2 టేబుల్ స్పూన్లు
  • పచ్చి మిర్చి          - 2 (మీ రుచికి సరిపడా)
  • పసుపు                 - చిటికెడు
  • కారం                    - 1/2 టీ స్పూను
  • ఉప్పు                   - సరిపడా
  • టమాటో కెచప్     - 1 టేబుల్ స్పూను
  • నిమ్మ రసం           - 1 టీ స్పూను
  • కొత్తిమీర                - కొద్దిగా

 

తయారు చేయు విధానం:

  • ముందుగా ఒక పెనం తీసుకొని నెయ్యి వేసి బ్రెడ్ ను ఒక వైపు దోరగా కాల్చి పెట్టుకోండి.
  • ఇప్పుడు ఒక బండీ తీసుకొని అందులో నూనె వేసి వేడి చేయండి.
  • ఇందులో ఉల్లిపాయలు,పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చే దాక వేయించండి.
  • ఇప్పుడు తురిమిన క్యారట్, సన్నగా తరిగిన క్యాప్సికం వేసి ఒక 5 - 8 నిమిషాలు వేయించండి.
  • ఇప్పుడు ఉప్పు, నిమ్మరసం, టమాటో కెచప్, పసుపు, కారం వేసి మరి కాసేపు వేయించి దించేయండి.
  • ఈ మిశ్రమాన్ని బ్రెడ్ మీద కాల్చని వైపు పరిచి మీద మరో బ్రెడ్ పెట్టుకొని తినటమే..
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com