"వెజిటబుల్ మసాలా టోస్ట్"
- September 22, 2015
ఇవాళ చక చక తయారయ్యే ఒక టిఫిన్ చూద్దాం..పిల్లలకి మరియు పెద్దలకి కూడా నచ్చే ఒక చక్కని వంటకం.. "వెజిటబుల్ మసాలా టోస్ట్"
కావలసిన పదార్ధాలు:
- బ్రెడ్ - 4
- క్యారట్ - 1
- క్యాప్సికం - 2
- ఉల్లిపాయలు - 2 పెద్దవి
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- పచ్చి మిర్చి - 2 (మీ రుచికి సరిపడా)
- పసుపు - చిటికెడు
- కారం - 1/2 టీ స్పూను
- ఉప్పు - సరిపడా
- టమాటో కెచప్ - 1 టేబుల్ స్పూను
- నిమ్మ రసం - 1 టీ స్పూను
- కొత్తిమీర - కొద్దిగా
తయారు చేయు విధానం:
- ముందుగా ఒక పెనం తీసుకొని నెయ్యి వేసి బ్రెడ్ ను ఒక వైపు దోరగా కాల్చి పెట్టుకోండి.
- ఇప్పుడు ఒక బండీ తీసుకొని అందులో నూనె వేసి వేడి చేయండి.
- ఇందులో ఉల్లిపాయలు,పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చే దాక వేయించండి.
- ఇప్పుడు తురిమిన క్యారట్, సన్నగా తరిగిన క్యాప్సికం వేసి ఒక 5 - 8 నిమిషాలు వేయించండి.
- ఇప్పుడు ఉప్పు, నిమ్మరసం, టమాటో కెచప్, పసుపు, కారం వేసి మరి కాసేపు వేయించి దించేయండి.
- ఈ మిశ్రమాన్ని బ్రెడ్ మీద కాల్చని వైపు పరిచి మీద మరో బ్రెడ్ పెట్టుకొని తినటమే..
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







