మంచి అవకాశాన్ని వదులుకున్న ప్రకాష్!!

- September 22, 2015 , by Maagulf
మంచి అవకాశాన్ని వదులుకున్న ప్రకాష్!!

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరో అవకాశాన్ని వదులుకున్నాడు. అందుకు కారణం డేట్స్ సమస్యనేట. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ తెలియజేశాడు. అది కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలి’ చిత్రంలో నటించే అవకాశం. ఇప్పటి వరకు రజనీకాంత్ చిత్రంలో పూర్తి నిడివి ఉన్న పాత్ర ఎప్పుడూ చేయని ప్రకాష్ రాజ్ ఈ సినిమా అవకాశం వచ్చిన్నప్పుడు యూనిట్ వాళ్ళు 60 రోజులు పాటు డేట్స్ కావాలని అడిగారట.

అయితే ప్రస్తుతం తాను పది సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నానని అన్ని రోజుల పాటు డేట్స్ కేటాయించడం చాలా కష్టమనే విషయం నాకు అర్థమైంది. అందుకే అవకాశాన్ని వదులుకున్నాను. చాలా మంచి కథ, రజనీకాంత్ గారి కెరీర్ లో ఓ డిఫరెంట్ మూవీ అవుతుంది. రెండు సినిమాలు, రెండు మరాఠీ, ఓ పిల్లల చిత్రం ఇలా పది భాషల చిత్రాల్లో నటిస్తున్నాను. అందుకనే డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నానని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చాడట. గతంలో ‘నరసింహ’ సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసిన ప్రకాష్ రాజ్ కి ఈ సినిమాలో పూర్తి నిడివి ఉన్న పాత్ర వచ్చినా చేయలేకపోవడం ఓ రకంగా దురదృష్టమేనని చెప్పాలి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com