ఇక్కడ షోరూం బండ్లేవీ లేవు.. అన్నీ సెకండ్ హ్యాండ్ బండ్లే.
- March 02, 2017
పూరీ మార్క్ రొమాన్స్.. పూరీ మార్క్ హీరోయిజం.. పూరీ మార్క్ టేకింగ్... మొత్తంగా రోగ్ ట్రైలర్ మాత్రం రొటీన్‌గా ఉన్నా ఫర్వాలేదనిపించింది. పూరీ మార్క్ డైలాగులు రోగ్‌లో ఉన్నాయి. హీరోయిజాన్ని తన స్టైల్లో చూపించాలంటే.. దానికి తగినంత విలనిజం ఉండాలి. అందుకే అనూప్ సింగ్‌ను సైకోగా పరిచయం చేస్తున్నాడు. బ్యాంకాక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథలో హీరో యాటిట్యూడ్‌ను.. పది రూపాయలిస్తే ఏమైనా చేసే యువకుడిగా చూపిస్తున్నాడు. హీరో ఆటో డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు. కొత్త కుర్రాడు ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. తెలుగులో నాలుగైదు సినిమాలు చేసిన మన్నారా చోప్రా, ఏంజెలా క్రిసిలింకీలు హీరోయిన్లు. ఎంత హీరోయిజం, విలనిజం చూపించాడో..
హీరోయిన్ల గ్లామర్‌ను అంతేలా వాడేసుకున్నాడు. ఇడియట్‌తో చంటిగాడి ప్రేమకథను పరిచయం చేసిన పూరీ.. రోగ్‌తో మరో చంటిగాడి ప్రేమకథ అంటూ తీసిన ఈ సినిమా ట్రైలర్ రొటీన్‌గానే ఉన్నా సినిమాతోనైనా బంపర్ హిట్ కొడతాడేమో చూడాలి. పూరీ మార్క్ డైలాగ్ ఒకటి చెప్పుకొంటే..
ఇక్కడ షోరూం బండ్లేవీ లేవు.. అన్నీ సెకండ్ హ్యాండ్ బండ్లే. ఇలాంటి డైలాగులకు సినిమాలో కొదవ ఏమీ ఉండబోదేమో.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







