చైనా కు వార్నింగ్ ఇచ్చిన ఐఎస్ఐ
- March 02, 2017
ఓ వైపు ఇరాక్ లో తాము ఓడిపోయినట్లు ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్డాది ప్రకటించినా.. మరోవైపు చైనాలో మాత్రం ఆ సంస్థ ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాము కచ్చితంగా దేశానికి తిరిగి వస్తామని, చైనాలో రక్తం ఏరులై పారిస్తామని ఉయ్ గర్ మైనారిటీకి చెందిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు స్పష్టం చేస్తున్నారు. చైనా లక్ష్యంగా ఐసిస్ చేసిన తొలి హెచ్చరిక కూడా ఇదే. సోమవారం విడుదల చేసిన అరగంట నిడివి గల వీడియోలో ఇస్లామిక్ స్టేట్ ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు అమెరికాకు చెందిన సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ వెల్లడించింది. తన పశ్చిమ ప్రాంతమైన జిన్ జియాంగ్ లో హింసాత్మక ఘటనలకు బహిష్కరణకు గురైన అక్కడి ఉయ్ గర్ వేర్పాటు వాదులే కారణమని చైనా చాలా కాలంగా చెబుతూ వస్తోంది.
వీరికి గ్లోబల్ జిహాదీ గ్రూపులతో సంబంధాలు కూడా ఉన్నాయని ఆరోపించింది.
తాజా వీడియోలో ఓ ఇన్ఫార్మర్ ను హతమార్చే ముందు ఓ ఉయ్ గర్ ఉగ్రవాది ఈ హెచ్చరికలు జారీ చేశాడు. 'మీ చైనీస్ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకోరు. మేం ఖలీఫా సైనికులం. ఆయుధాలతోనే మీకు సమాధానం చెబుతాం. రక్తాన్ని ఏరులుగా పారిస్తాం..' అని ఆ వీడియోలో హెచ్చరించాడు. ఎక్కువగా ముస్లిం జనాభా ఉన్న ఈ ప్రాంతంపై చైనా వివక్ష చూపుతున్నదని ఉయ్ గర్లు ఆరోపిస్తున్నారు. వారు తమకు ఇస్లామిక్ స్టేట్ తో సంబంధాలు ఉన్నాయని అంగీకరించడం కూడా ఇదే తొలిసారి. ఇక ఐసిస్ నేరుగా చైనాకు హెచ్చరికలు చేయడం కూడా ఇదే మొదటిసారి అని నేషనల్ సెక్యూరిటీ కాలేజ్ ఆఫ్ ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ ఎక్స్ పర్ట్ మైఖేల్ క్లార్క్ తెలిపారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల లక్ష్యం చైనాయే అని ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







