వరల్డ్ ఆఫ్ విమెన్ సినిమా - బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన
- March 02, 2017
దుబాయ్: వరల్డ్ ఆఫ్ విమెన్ సినిమా - వావ్ ఫిలిం ఫెయిర్ మిడిల్ ఈస్ట్, దుబాయ్‌లోని ప్రముఖ డాక్టర్లు అలాగే రీసెర్చ్ బేస్డ్ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ అస్ట్రాజెనెకా జిసిసి దేశాల్లో వందలాది మంది మహిళల మృతికి కారణమవుతున్న బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనుంది. మార్చ్ 3 నుంచి 8 వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేలా రూపొందించిన 'బ్రెస్ట్ ఫ్రెండ్స్' ఫిలింని గెలీరియా మాల్ - అల్ వాసల్ రోడ్లో మార్చ్ 4న ప్రదర్శిస్తారు. 'లిజన్ టు యువర్ బాడీ - క్యాన్సర్ అవేర్నెస్' పేరుతో జరిగే చర్చా కార్యక్రమంలో పలువురు నిపుణులు, పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. వెల్ విమెన్ క్లినిక్ -దుబాయ్ మెడికల్ డైరెక్టర్ మరియు కన్సల్టెంట్ స్పెసలిస్ట్ బ్రెస్ట్ సర్జన్ డాక్టర్ హౌరియా కాజిమ్, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ ఎక్కువగా మహిళల్ని బలి తీసుకుంటున్న వ్యాధి అని నిపుణులు చెబుతున్నారు. ముందస్తుగా వీటిని పసిగట్టగలిగితే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చని, అందుకే ఇలాంటి అవగాహనా కార్యక్రమాలు అవసరమని వారు చెబుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, ఒవేరియన్ క్యాన్సర్ కేసులూ పెరుగుతున్నాయని ఇది ఆందోళనకరమైన పరిస్థితి అని నిపుణులు వెల్లడించారు.

తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







