అమెరికాలో మసీదులకు బెదిరింపు లేఖలు

- March 03, 2017 , by Maagulf
అమెరికాలో మసీదులకు బెదిరింపు లేఖలు

ముస్లింలను ఊచకోత కోస్తామని బెదిరిస్తూ అమెరికాలో రెండు మసీదులకు బెదిరింపు లేఖలు అందటం స్థానికంగా కలకలం సృష్టించింది. మేరీలాండ్‌ రాష్ట్రంలోని మేరీలాండ్‌, సిల్వర్‌ స్ప్రింగ్‌ నగరాల్లో వున్న ఈ రెండు ఇస్లామిక్‌ కేంద్రాలకు ఈ బెదిరింపులు మెయిల్‌ ద్వారా అందాయి. ఇస్లామిక్‌ ఎడ్యుకేషన్‌ సోసైటీ అధ్యక్షుడు సోమవారంనాడు తమ కేంద్రం మెయిల్‌ బాక్స్‌లో వున్న కవర్‌లో ఈ బెదిరింపు లేఖ వుందని కౌన్సిల్‌ ఆన్‌ అమెరికన్‌ ఇస్లామిక్‌ రిలేషన్స్‌ వెల్లడించింది. దీనిని జాతి విద్వేష నేరంగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటువంటి సందేశంతోనే ఇక్కడికి కొద్ది దూరంలో వున్న మరో ముస్లిం ప్రార్థనా మందిరంలో ఒక లేఖ బయటపడిందని న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. ఈ రెండు కవర్లపై ఐరోపా దేశాల స్టాంప్‌లు వున్నాయని పోలీసులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com