డ్రైవర్ల కోసం ఆర్‌టిఎ - స్మార్ట్‌ యార్డ్స్‌

- March 07, 2017 , by Maagulf
డ్రైవర్ల కోసం ఆర్‌టిఎ - స్మార్ట్‌ యార్డ్స్‌

రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ), కొత్తగా స్మార్ట్‌ యార్డ్‌ని డ్రైవర్ల పరీక్ష కోసం ఏర్పాటు చేసింది. లైట్‌ డ్రైవర్‌ లైసెన్స్‌ అప్లికెంట్స్‌ కోసం దుబాయ్‌ డ్రైవింగ్‌ సెంటర్‌, అల్‌ ఖయిల్‌ బ్రాంచ్‌, అల్‌ కోజ్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలో దీన్ని ఏర్పాటు చేశారు. మాన్యువల్‌ గేర్‌తో కూడిన వాహనానికి కొత్త టెక్నాలజీని జోడించి ఇక్కడ డ్రైవర్లకు పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. దుబాయ్‌ని స్మార్టెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దడంలో భాగంగా పలు చర్యలు చేపడుతున్నారు. అందులో ఈ స్మార్ట్‌ డ్రైవర్‌ టెస్ట్‌ టెక్నాలజీ కూడా ముఖ్యమైనది. ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా విధానం ఇదే ప్రథమం. పరీక్ష కోసం ఉపయోగించే కారుతోపాటు, యార్డ్‌కీ అత్యాధునిక సెన్సార్లను అమర్చారు. వాటి ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో పరీక్షను నిర్వహించడానికి వీలవుతుంది. ఒకేసారి పలు వాహనాల ద్వారా డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా టవర్‌ని ఏర్పాటు చేసి, దాని ద్వారా అత్యంత ఖచ్చితంగా పాస్‌ అయినవారిని ఎంపిక చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com