ప్రైవేటు సంస్థల్లో 2,06,00 ఒమానియన్లు

- September 23, 2015 , by Maagulf
ప్రైవేటు సంస్థల్లో 2,06,00 ఒమానియన్లు


ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న భీమా పొందిన ఒమానియన్స్ సంఖ్యలో 0.1శాతం వృద్ధి కన్పిస్తోందని అధికారిక లెక్కలు వెల్లడించాయి. గత జులైలో లెక్కించబడినదాన్ని బట్టి చూస్తే 2,06,348కి ఒమానియన్ కార్మికుల సంఖ్య తేలింది. జాతీయ గణాంకాల సమాచారం ఈ లెక్కల్ని వెల్లడించింది. ఇందులో 1,58,950 మంది పురుషులు కాగా, 47,398 మంది స్త్రీలు. 62,461 మందికి 325 నుంచి 400 ఓఎంఆర్ (ఒమాన్ రియాద్) జీతంగా అందుతోంది. ఈ కేటగిరీలోని వారి సంఖ్య సగం శాతం తగ్గినట్లు తెలుస్తోంది. 400 నుంచి 500 ఒమన్ రియాద్ జీతంగా అందుకుంటున్నవారి సంఖ్యలో మార్పులేదు. ఈ సంఖ్య 46,567గా వుంది. 500 నుంచి 600 జీతం అందుకుంటున్నవారి సంఖ్య 20,640. 600 నుంచి 700 మధ్య జీతం అందుకుంటున్నవారి సంఖ్య 13,677. 700 నుంచి 800 అందుకుంటున్నవారి సంఖ్య 8,976. 800 నుంచి 900 అందుకుంటున్నవారి సంఖ్యలో ఒక శాతం పెరుగుదల కన్పించింది. ఈ సంఖ్య 6,601గా వుంది. 900 నుంచి 1000 అందుకుంటున్నవారి సంఖ్య 4944గా వుంది. 1000 నుంచి 2000 జీతం అందుకుంటున్నవారి సంఖ్యలో 0.3 శాతం పెరుగుదల ననమోదైంది. వీరి సంఖ్య 18,125. 2000 కన్నా ఎక్కువ జీతం అందుకుంటున్నవారి సంఖ్య 7,064. అయితే ఇందులో 5.1 శాతం తగ్గుదల నమోదైంది. 


--నూనె లెనిన్ కుమార్(ఒమాన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com