దోహాలోని ఇండియన్ ఎంబసీకి 3117 ఫిర్యాదులు
- September 23, 2015
భారత ఎంబసీ యొక్క కమ్యూనిటీ సంక్షేమ విభాగానికి ఇప్పటివరకు 3117 ఫిర్యాదులు అందాయి. 2014లో ఈ సంఖ్య 3943గా వుంది. రాయబారి సంజీవ్ అరోరా, డిప్యూటీ చీఫ్ మిషన్ ఆర్ కె సింగ్ మరియు ఇతర అధికారులు, ఫిర్యాదుదారుల్ని కలుసుకుని, వారి సమస్యల గురించి చర్చించారు. ఖతార్ ప్రభుత్వంతో చర్చించి, సమస్యల పరిష్కారానికి మార్గం కనుగొంటామని ఫిర్యాదుదారులకు అధికారులు హామీ ఇచ్చారు. సెప్టెంబర్ వరకు ఎంబసీలో నమోదైన మరణాల సంఖ్య 11. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 209 మరణాలు నమోదయ్యాయి. 2014లో ఈ సంఖ్య 279. ఎంబసీ 22 అత్యవసర సర్టిఫికెట్స్ని, టిక్కెట్స్నీ భారతదేశానికి తిరిగి వెళ్ళేందుకోసం జారీ చేసింది. ఎంబసీ అధికారులు తరచుగా కేంద్ర కారాగారాన్ని సందర్శించి, భారతీయ ఖైదీల సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. భారతీయ ఉద్యోగుల సంక్షేమానికి దౌత్య కార్యాలయం ఆధ్వర్యంలో పనిచేసే కమ్యూనిటీ సంఘం సెప్టెంబర్ నెలలో నిరాశ్రయులైన వారి కోసం ఐదు విమాన టిక్కెట్లు జారీ చేసిందని అధ్యక్షుడు అరవింద్ పాటిల్ చెప్పారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







