టీడీపీ నేత భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మృతి
- March 12, 2017
జిల్లాలో కీలక నేతగా గుర్తింపు పొందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నంద్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి భూమా దేహం స్పందించలేదు. దీంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఊహించని ఘటనతో భూమా కుటుంబసభ్యులు, అనుచరులు శోకసంద్రంలో మునిగిపోయారు. శోభానాగిరెడ్డి మృతికి సంబంధించిన చేదు గురుతులు చెరిగిపోక ముందే భూమా కూడా మరణించడంతో అనుచరులు షాక్‌కు గురయ్యారు. 1964 జనవరి 8న కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొత్తపల్లిలో భూమా జన్మించారు. భూమా నాగిరెడ్డికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తండ్రి హత్య తర్వాత రాజకీయాల్లోకి భూమా నాగిరెడ్డి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. సోదరుడి మృతి తర్వాత 1992 ఉప ఎన్నికల్లో భూమా మొదటిసారి ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు.
2014లో వైసీపీ నుంచి భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2016లో కూతురు అఖిలప్రియతో కలిసి భూమా టీడీపీలో చేరారు. టీడీపీ నుంచే రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలనుకున్న భూమా భావించారు. అయితే కూతురు అఖిలప్రియ రాజకీయాల్లో స్థిరపడ్డాక విశ్రాంతి తీసుకుంటానని భూమా నాగిరెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు. 2014 ఏప్రిల్ 24 న రోడ్డు ప్రమాదంలో సతీమణి శోభ మృతి చెందారు. శోభ మృతి తర్వాత భూమా నాగిరెడ్డి మానసికంగా కుంగిపోయారు. అనారోగ్యం కారణంగా ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఏడాది నుంచి భూమా నాగిరెడ్డి ఆరోగ్యం సరిగా లేదు. గత వారం రోజులుగా భూమా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిన్న విజయవాడలో భూమానాగిరెడ్డి చంద్రబాబును కలిశారు. భూమా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







