భారత ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లేందుకు సంఖ్యను పెంచిన సౌదీ
- March 12, 2017
ముస్లింలు మక్కా వెళ్లడాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. దీన్నే హజ్ యాత్ర అంటారు. ప్రతీ సంవత్సరం సౌదీ ప్రభుత్వం ఒక్కొ దేశం నుంచి ఈ హజ్ యాత్రకు వచ్చేవారి సంఖ్యను నిర్ణయిస్తుంది. అయితే ఈ సంవత్సరం మన దేశం నుంచి హజ్ యాత్రకు వచ్చేవారి సంఖ్యను సౌదీ ప్రభుత్వం పెంచింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను జనవరిలోనే విడుదల చేసింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా మార్చ్ 9 వరకు హజ్ యాత్రకు వెళ్లదలచుకున్నవారు దరఖాస్తులు చేసుకున్నారని భారత మైనారిటీ వ్యవహరాల శాఖ పేర్కొంది. మార్చ్14న డ్రా ద్వారా హజ్ యాత్రికులను ఎంపిక చేస్తామని అధికారులు సౌదీ ప్రభుత్వానికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో 2052 మంది హజ్ యాత్రకు వెళ్లారు. ప్రస్తుతం ఈ సంఖ్యను ప్రస్తుతం 2728కు పెంచారు. తెలంగాణ నుంచి గతంలో 2532 మంది వెళ్తే, ప్రస్తుతం వీరి సంఖ్యను 3367కు పెంచారు. కేరళ నుంచి అత్యధికంగా హజ్ యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. రెండవస్థానంలో మహరాష్ట్ర, తర్వాతి స్థానాల్లో గుజరాత్, కర్ణాటకలు ఉన్నాయి. మొత్తానికి ఈ సంవత్సరం భారత్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి సంఖ్యను 34,005గా సౌదీ ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







