దుబాయ్ టాక్సీ లో శిశువు మర్చిపోయిన తల్లిదండ్రులు
- March 13, 2017
దుబాయ్: ఎంత పరధ్యానంలో ఉంటె మాత్రం పసిబిడ్డనే మరిచిపోతారా ?.ప్రయాణ హడావిడిలో పడి... ఓ చిన్నారిని అద్దె కారులో వదిలి ఆ తరువాత ఆ బుడతడు గుర్తొచ్చి లబోదిబోమని ఆ తల్లితండ్రులు గగ్గలు పెట్టారు. లేకపోతే ఇలాంటి అనర్ధాలే జరుగుతాయి. వివరాలలోకి వెళితే, గల్ఫ్ దేశానికి చెందిన ఒక జంట పర్యటన కోసం దుబాయ్ సందర్శించారు. తమ వెంట ఆరునెలల వయసున్న ఓ బాబును సైతం వెంట తీసుకువచ్చారు. పర్యటన ముంగించుకుని తిరిగి స్వదేశానికి బయలుదేరారు. అల్ రిగ్గాలో ఉన్న ఒక హోటల్లో వారు విడిది చేశారు. అక్కడి నుంచి ట్యాక్సీలో ఎయిర్‌పోర్టుకి బయలుదేరారు. అయితే బాబు ట్యాక్సీ ఎక్కగానే పడుకున్నాడు. ఎయిర్‌పోర్టు చేరుకోగానే భార్య భర్తలు టాక్సీలోనుంచి దిగిపోయారు . వీరు తమతో బాబును తీసుకురాలేదు. దాంతో బాబు టాక్సీలోనే ఉండిపోయాడు. భార్య ఎత్తుకుని ఉంటుందని భర్త అనుకున్నాడు. భర్త ఎత్తుకున్నాడనుకుంది భార్య భావించింది. విమాన ప్రయాణ హడావిడిలో ఆ బాబు సంగతి మరిచిపోయారు. ఎయిర్‌పోర్టు లోపలికెళ్లి చూసేసరికి బాబు వారితో లేడు. బయటకు వచ్చి చూస్తే టాక్సీ కూడా లేదు. చేసేదేమి లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆర్టీఎ శాఖను అప్రమత్తం చేసి టాక్సీ లోకేషన్‌ను జీపిఎస్ సిస్టం ద్వారా కనుగొన్నారు. పోలీసుల నుంచి ఫోన్ వచ్చేంత వరకు తన టాక్సీలో ఒక బాబు ఉన్నట్లు డ్రైవర్ కూడా గుర్తించలేదు. ఒక కాఫీషాపులో ఎంచక్కా కాఫీ తాగుతున్నా ఆ డ్రైవర్ కు పోలీసులనుంచి ఫోన్ రాగానే కాఫీ కషాయం మాదిరిగా కనిపించింది. వెంటనే వెళ్లి వెనుక సీట్లో తొంగి చూడగా చిన్నారి బాబు అమాయకంగా బజ్జోని ఉండటం చూసి ...ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌లో బాబును అప్పగించాడు. వెంటనే పోలీసులు బాబును తల్లిదండ్రుల దగ్గరికి చేర్చారు. పర్యాటక పోలీసు విభాగం వద్ద ఒక ఉన్నతాధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజా రవాణా వద్ద వారి పిల్లలు మరియు సామానులు వదిలి వెళ్లరాదని పర్యాటకులను హెచ్చరించారు.
తాజా వార్తలు
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ దిర్హాముల విజయం..!!







