'ఆచారి అమెరికా యాత్ర'లో నటించనున్న మంచు విష్ణు
- March 13, 2017
"దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం" లాంటి సూపర్ హిట్ చిత్రాల అనంతరం మంచు విష్ణు-జి.నాగేశ్వర్రెడ్డిల క్రేజీ కాంబిణేషన్ లో తెరకెక్కనున్న మూడో చిత్రం "ఆచారి అమెరికా యాత్ర". సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మార్చి 19న డా.మోహన్ బాబుగారి పుట్టినరోజు సందర్భంగా "ఆచారి అమెరికా యాత్ర" చిత్ర ప్రారంభోత్సవం తిరుపతిలో జరగనుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "దర్శకులు నాగేశ్వర్రెడ్డి ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశారు. మల్లిడి వెంకటకృష్ణ మూర్తి ఈ చిత్రానికి కథను సమకూర్చారు. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ మేజర్ పార్ట్ అమెరికాలో జరగనుంది. మంచు విష్ణు, బ్రహ్మానందంల కాంబినేషన్ విశేషంగా అలరిస్తుంది. మార్చి 19న లాంఛనంగా సినిమా మొదలవుతుంది. నటీనటులు మరియు ఇతర సాంకేతికనిపుణుల ఎంపిక జరుగుతోంది. ప్రారంభోత్సవం కల్లా మిగిలిన వివరాలు వెల్లడిస్తాం" అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







