అట్లాస్ రామచంద్రన్ త్వరలో విడుదల
- March 15, 2017
చెల్లని చెక్కుని ఇచ్చి దుబాయ్ లో మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడిన గల్ఫ్ దేశాల సమాఖ్యలో, బహరేన్ లో ప్రముఖడైన ఓ భారతీయ వ్యాపారవేత్త త్వరలో విడుదల కానున్నారు.76 ఏళ్ళ ఎం ఎం రామచంద్రన్ అట్లాస్ గ్రూప్ చైర్మన్ గా ఉన్న కాలంలో 53 మిలియన్ దిర్హామ్లతో ఒక చెల్లని చెక్కుని ఇచ్చారు.తనిఖీలలో అది బౌన్స్ కావడంతో నవంబర్ 2015 లో దుబాయ్ చట్టవిరుద్ధమైన పనులు చేసినందుకు ఆయనపై ఒక కేసు నమోదైంది. ఎం ఎం రామచంద్రన్ న్యాయవాదులు తెలిపిన వివరాల ప్రకారం, డబ్బు ఇవ్వాల్సిన బ్యాంకులకు ఆయనకు ఏకాభిప్రాయము కుదిర్చారు. దీనితో ఆయనకు వ్యతిరేకంగా నమోదైన కేసులను ఉపసంహరించుకోవడానికి బ్యాంకులు అంగీకరించాయి. అతని తరపు న్యాయవాదులు మిగిలిన మొత్తం డబ్బు చెల్లింపులో మరింత సమయం కావాలని ఒక నిర్దిష్ట కాలంలో మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తామని అందుకు అనుమతించమని భారత ప్రభుత్వంని అభ్యర్థించారు.డిప్రెషన్ మరియు మధుమేహం సహా పలు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రామచంద్రన్ యొక్క ఆరోగ్య నివేదికల ప్రకారం ఆయన విడుదలకు మార్గం ఏర్పడింది. అయితే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులైన ఆయన కుమార్తె, అల్లుడు ఇంకా జైలులోనే ఉన్నారు. కాగా, వారి విడుదలకు ఏ రకమైన స్పష్టీకరణ లేదు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







