నాని, సుశాంత్ లు సపోర్ట్ చేస్తోన్న నగరంసినిమాకు

- March 15, 2017 , by Maagulf
నాని, సుశాంత్ లు సపోర్ట్ చేస్తోన్న నగరంసినిమాకు

ప్రస్థానం సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన సందీప్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో సూపర్ హిట్ అందుకొన్నాడు.. అనంతరం సందీప్ చేసిన సినిమాలు అన్నీ ఫర్వాలేదు అనే టాక్ తెచ్చుకొన్నాయి కానీ హిట్ ని ఇవ్వలేకపోయాయి... కాగా సందీప్ తాజాగా తమిళంలో చేసీన సినిమా ‘మానగరం’ తమిళంలోనే గాక తెలుగులో కూడా ‘నగరం’ పేరుతో విడుదలై పాజిటివ్ టాక్ తో నడుస్తూ హిట్ దిశగా దూసుకుపోతోంది. ప్రేక్షకులు, విమర్శకులు కూడా సందీప్ కిషన్ కెరీర్లో ఇదొక మంచి చిత్రంగా నిలుస్తుందని ప్రశంసిస్తున్నారు. ప్రేక్షకులతో పాటు ఈ సినిమాపై సెలబ్రేటీలు కూడా మంచి రిపోర్ట్ అందిస్తున్నారు. యంగ్ హీరోలు నాని, సుశాంత్ లు కూడా సందీప్ కిషన్ కు తమ వంతు సపోర్ట్ అందిస్తున్నారు. సినిమా చూసి నచ్చడంతో తమ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా చిత్రం బాగుందని, మంచి స్క్రీన్ ప్లే అని, నటీనటులు, ఇతర టీమ్ బాగా కష్టపడ్డారని, తప్పక చూడవలసిన సినిమా అని ప్రేక్షకులకు తెలియజేస్తూ స్నేహితుడి కోసం, ఒక మంచి సినిమా సక్సెస్ కోసం తమ వంతు కృషి చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com