అంచలంచలుగా పెరుగుతున్న పసిడి మరియు వెండి ధరలు..!
- September 25, 2015
బంగారం ధర నెల రోజుల గరిష్ఠానికి చేరింది. మళ్లీ రూ.27,000 మార్కును దాటేసింది. ఈ రోజు రూ.400 పెరగడంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.27,250కి చేరింది. పెళ్లిళ్ల సీజను ముందుండటం, రీటైలర్లు, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావం తదితర కారణాల వల్ల ఈ లోహం ధర పెరుగుతోందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2.11శాతం పెరిగి 1,152 అమెరికన్ డాలర్లకు చేరింది.పెరిగిన వెండిఈ రోజు వెండి సైతం చెప్పుకోదగ్గ రీతిలో పెరిగి రూ.36,000 మార్కును దాటేసింది. ఈ రోజు రూ.1,100 పెరగడంతో కేజీ వెండి ధర రూ.36,500కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేపట్టడంతో ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు వెండి ధర 15.15 అమెరికన్ డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు







