వ్యర్ధాలనుంచీ అద్భుతాలు సృష్టించవచ్చు
- September 25, 2015
కుళ్ళిపోయిన ఆహార వ్యర్ధాల నుంచి మీథేన్ వాయువును సేకరించి దాన్నుంచి విద్యుత్‌ని తయారు చేయవచ్చనీ, అలాగే వ్యర్థాలను కంపోస్ట్‌గా కూడా ఉపయోగించవచ్చని ఓ ప్రముఖ కౌన్సిలర్ ప్రతిపాదించారు. ఉత్తర మున్సిపల్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ అహ్మద్ అల్ కూహెజి, వ్యర్ధాలను పారవేయడం కన్నా వాటిని ఏదో ఒక విధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. తన ఆలోచనలను కార్యరూపంలోకి మలచేందుకు తమ కౌన్సిల్ మున్సిపాలిటీలు మరియు అర్బన్ ప్లానింగ్ ఎఫైర్స్ మినిస్టర్ ఖలీఫ్ సహాయంతో అధునాతన రీసైక్లింగ్ సెంటర్ అవసరమని చెప్పారు. వ్యర్ధాల్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఈ విధానం తోడ్పడుతుందన్నారాయన. ప్లాస్టిక్‌ని రీసైక్లింగ్ చేయడం మంచిదనీ, అది భూమిలో కలవడం వలన ప్రమాదకరంగా మారుతుందని చెప్పారు కూహెజి. ఆహార వ్యర్ధాలు కుళ్ళిన తర్వాత దాన్నుంచి మీథేన్ వస్తుందనీ, భూమి మీద పారేయడం లేదా పాతి పెట్టడం ద్వారా విలువైన మీథేన్ శక్తి వృధా అవుతుందని చెప్పారాయన. బార్సెలోనాలో వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి తగిన ఏర్పాట్లను తాను చూశాననీ, తద్వారా సేకరించిన గ్యాస్‌తో పవర్‌ని తయారుచేస్తారని వివరించారు. బహరెయిన్‌లో మూడు కన్నా ఎక్కువ అంతస్తులు గల భవనాల్లో ఖచ్చితంగా వేస్టేజ్ కోసం ఓ రూమ్‌ని ఏర్పాటు చేయాలని సూచించారు కూహెజి. రోజువారీ 1.5 మిలియన్ టన్నుల వేస్టేజ్ ఉంటుందని దీన్ని సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని కూహెజి చెప్పారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







