ఖతార్ లో అంబరాన్నంటిన ఈద్ సంబరాలు
- September 26, 2015
ఈద్ సంబరాల నేపథ్యంలో మాల్స్, పార్కులు, బీచ్లు సహా ఎంటర్టైన్మెంట్ జోన్స్ అన్నీ సందర్శకులతో కళకళ్ళాడాయి. ఖతార్ టూరిజం అథారిటీ, సందర్శకుల్ని అలరించేందుకు శుక్రవారం పలు వినోద కార్యక్రమాల్ని వివిధ ప్రాంతాల్లో చేపట్టాయి. కటారా, సౌక్ వఖిఫ్, పెరల్ కతార్ మరియు ఎస్పర్ జోన్ ఇంకా ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు సందడి చేశారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం పాకిస్తానీయుల కోసం అల్ వక్రా మరియు అల్ నూర్లో నేపాలీయుల కోసం మరో కార్యక్రమం నిర్వహించింది. చిన్న పిల్లల ఎంటర్టైన్మెంట్తోపాటు, ఆరోగ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చేపట్టారు. హయాత్ ప్లాజా సూపర్వైజర్ మహమ్మద్ సాహిల్ మాట్లాడుతూ, తొలి రోజు ఈద్ సాయంత్రం నుంచి ప్లాజా మొత్తం సందర్శకులతో నిండిపోయినట్లు చెప్పారు. జంగిల్ జోన్లో పిల్లలు ఆడిపాడుతూ ఎంజాయ్ చేశారన్నారు. సోమవారం వరకూ ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని, అప్పటిదాకా ప్లాజా జనంతో నిండిపోతుందని ఆయన చెప్పారు. కొన్ని ఈవెంట్స్ ఏడు రోజులపాటు కొనసాగనున్నాయి.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







