దుబాయ్ లో మరో కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి
- September 25, 2015
అబుదాబీ కేంద్రంగా నడుస్తోన్న విపిఎస్ హెల్త్కేర్ సంస్థ బుర్ దుబాయ్లో 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించింది. యూఏఈలో ఇది 10వ ఆసుపత్రి కాగా, దుబాయ్లో ఆ సంస్థకు రెండవది. విపిఎస్ హెల్త్ కేర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షంషేర్ వయాలిల్ మాట్లాడుతూ, తమ గ్రూపు ద్వారా ఆరోగ్య సేవల్ని ఇంకా విస్తరించాలనుకుంటున్నట్లు చెప్పారు. తక్కువ స్థాయిలో ఫార్మాస్యూటికల్స్ తయారీలోకి అడుగు పెట్టామనీ, రానున్న రోజుల్లో విస్తరిస్తామని చెప్పారాయన. తల్లి, బిడ్డల సంరక్షణ, యూరాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, జనరల్ సర్జరీ, ఫ్యామిలీ మెడిసిన్, మినిమల్లీ ఇన్వేజిబుల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ తదితర సర్వీసులు తమ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటాయని డాక్టర్ వయాలిల్ చెప్పారు. ప్రెగ్నెన్సీ, గైనకాలజీ విభాగాల్లో అత్యాధునికమైన అత్యవసర వైద్య సదుపాయాలు ఇరవై నాలుగు గంటలూ ఉంటాయని అన్నారు. 600కి పైగా డాక్టర్లు ఈ గ్రూప్లో పనిచేస్తున్నారు. విపిఎస్ హెల్త్ కేర్ సీఈఓ డాక్టర్ షాజిర్ గఫార్ మాట్లాడుతూ, అత్యాధునిక వైద్య సౌకర్యాలతో రోగలకు సేవలు అందించడం ఆనందంగా ఉందనీ, వైద్య సేవల్ని ఇంకా విస్తరించి, వైద్య రంగంలో తమ సంస్థను అగ్రగామిగా నిలపాలన్నదే లక్ష్యమని చెప్పారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







