భూములు రెడీ బందరు పోర్టుకు
- March 18, 2017
రేపు 3014 ఎకరాలు అప్పగింత
బందరు పోర్టు నిర్మాణానికి అవసరమైన భూమ ల అప్పగింతకు రంగం సిద్ధమైంది. మొత్తం 4,800 ఎకరాలు నిర్మాణ సంస్థ నవయుగకు అప్పగించా ల్సి ఉండగా, వాటిలో ప్రభుత్వ, అసైన్డ్ భూములు 3014.43 ఎకరాలు ఉన్నాయి. తొలుత ఈ భూములను పోర్టుకు అప్పగించాలని ఇటీవల కృష్ణాజిల్లా కలెక్టర్ బాబుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో... అందుకనుగుణంగా అధికారులు చర్య లు చేపట్టారు. శనివారం ప్రభుత్వ, అసైన్డ్ భూములకు సంబంధించిన హద్దులను అధికారు లు పరిశీలించారు. మచిలీపట్నంలో పోర్టు నిర్మాణంతోపాటు ఇండస్ర్టియల్ కారిడార్, మెగా టౌన్షిప్ ఏర్పాటు కోసం 33,177.78 ఎకరాలకు భూ సమీకరణ జరుగుతోంది.
ఈ ప్రక్రియను అమలు చేసేందుకు ప్రభుత్వం మచిలీపట్నం అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ(ముడా)ని ఏర్పాటు చేసింది. భూ సమీకరణపై రైతులకు ప్రజాప్రతినిధులు, అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రైవేటు భూములకు సంబంధించి కొన్ని సందేహాలు నివృత్తి కావాల్సి ఉండటంతో ప్రభుత్వ, అసైన్డ్ భూములపై అధికారులు దృష్టి సారించారు. పోర్టుతోపాటు ఇండస్ర్టియల్ కారిడార్, మెగా టౌన్షిప్ నిర్మాణాల కోసం భూ సమీకరణ ప్రక్రియ చేపట్టగా, తొలుత పోర్టు భూములకు సంబంధించిన ప్రక్రియ పూర్తిచేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బందరు మండలంలోని మంగినపూడి, తపసిపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం, పోతేపల్లి, చిలకలపూడి, బందరు రూరల్ గ్రామాల్లో పోర్టు భూములను గుర్తించగా, ఆ భూములకు సంబంధించిన సర్వే తదితర కార్యక్రమాలు ఇంతకు ముందే పూర్తయ్యాయి. ఆయా భూముల్లో ముడా అధికారులు ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి, లబ్ధిదారులను గుర్తించారు. ఇందుకు సంబంధించి శనివారం ప్రభుత్వ, అసైన్డ్ భూముల హద్దులను మరోసారి పరిశీలించారు. మచిలీపట్నం తహసిల్దార్ నారదముని, బందరు పోర్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.మునిరెడ్డి, ముడా అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించారు.
వీటి అప్పగింతల ప్రక్రియ సోమవారం జరుగుతుందని ముడా వైస్ చైర్మన్ ఎం.వేణుగోపాలరెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!







