కబాలీ రైస్
- March 19, 2017
కావలసినవి: బాస్మతి బియ్యం అర కేజి, శనగపప్పు 200 గ్రా., తరిగిన ఉల్లిపాయలు 100 గ్రా., తరిగిన పచ్చిమిర్చి 6, అల్లం-వెల్లుల్లి ముద్ద 2 టేబుల్ స్పూన్లు, కారం అర టేబుల్ స్పూను, గరం మసాలా 10గ్రా., పుదీనా ఒక కట్ట, నిమ్మకాయ ఒకటి, నెయ్యి 50 గ్రా., కుంకుమ పువ్వు చిటికెడు, నూనె 50 గ్రా., పెరుగు 2 కప్పులు ఉప్పు తగినంత.
ఎలా చేయాలి
బియ్యాన్ని శుభ్రం చేసి నీళ్లలో నానబెట్టాలి. శనగపప్పును కుక్కర్లో ఉడికించాలి. బియ్యాన్ని మూడొంతులు ఉడికించాలి. బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలను బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి. పసుపు, కారం, గరం మసాలా వేసి కలపాలి. తర్వాత ఉడికిన శనగపప్పు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బాణలిలో నెయ్యి వేడి చేయాలి. అన్నంలో సగభాగాన్ని బాణలిలో వేయాలి. దాని పైన శనగపప్పు మిశ్రమాన్ని ఈ అన్నంపైన పొరలా వేయాలి. దాని పైన మిగిలిన అన్నాన్ని కూడా వేసి కొద్దిగా నెయ్యి పోయాలి. దాని పైన నిమ్మరసాన్ని చల్లాలి. కుంకుమ పువ్వు కూడా చల్లి మొత్తమంతా కలిపి 15 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. వడ్డించే ముందు అన్నాన్ని బాగా కలపాలి. దీనిని వేడి వేడిగా తింటే బావుంటుంది.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







