జర్నలిస్టుపై రోబో '2.0' యూనిట్ దాడి
- March 22, 2017
అగ్ర కథానాయకుడు రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘2.0’ సెట్లో ఓ ఫొటో జర్నలిస్టుపై దాడి జరిగింది. దీంతో బాధిత జర్నలిస్టు ‘2.0’ యూనిట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ‘2.0’ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అమీ జాక్సన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్నారు.
ఎ.ఆర్. రెహమాన్ బాణీలు సమకూరుస్తున్నారు. దీపావళికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







