సౌదీ నుండి నిజామాబాద్ కు చేరిన వలసజీవి శవపేటిక

- March 22, 2017 , by Maagulf
సౌదీ నుండి నిజామాబాద్ కు చేరిన వలసజీవి శవపేటిక

నిజామాబాద్ జిల్లా డిచుపల్లి మండలం రాంపూర్ కు చెందిన కాశోల్ల దేవేందర్ (26) తేది: 09.03.2017 న సౌదీ అరేబియాలోని దమ్మామ్ లో గుండెపోటుతో మరణించారు. ఇతని మృతదేహం కలిగిన శవపేటిక తేది: 23.03.2017 న ఉదయం దమ్మామ్ (సౌదీ) నుండి హైదరాబాద్ కు చేరనున్నది. శవపేటికతో పాటు సౌదీ నుండి అదే గ్రామానికి చెందిన కలిగోట్ ప్రదీప్ వస్తున్నారు. కాశోల్ల దేవేందర్ తండ్రి  శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేయడానికి తమిళనాడు నుండి 50 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. 

తెలంగాణ ఎమిగ్రంట్స్ లేబర్ యూనియన్ (తెలంగాణ ప్రవాసి కార్మిక సంఘం) రాష్ట్ర ఉపాధ్యక్షులు బొండల గంగా ప్రసాద్ (మోర్తాడ్ +91 88976 15160) గారి సమన్వయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నారై విభాగం వారు హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి రాంపూర్ వరకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.

ఎం. భీమ్ రెడ్డి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com