తన విన్యాసాలను చూస్తున్న వ్యక్తినే ' ఢీ ' కొట్టిన స్టంట్ డ్రైవర్ అబుదాబిలో అరెస్టు

- March 22, 2017 , by Maagulf
తన విన్యాసాలను చూస్తున్న వ్యక్తినే  ' ఢీ '  కొట్టిన  స్టంట్ డ్రైవర్ అబుదాబిలో అరెస్టు

నిర్లక్ష్యంగా వాహనాన్ని డ్రైవింగ్ చేయడమే కాక తన విన్యాసాలను చూస్తున్న ఒక వ్యక్తిని వాహనంతో ' ఢీ ' కొట్టి గాయాల పాల్జేసిన ఓ19 ఏళ్ల యువకుడిని అబూధాబీ పోలీసులు అరెస్ట్ చేశారు.తాను నడుపుతున్న వాహనంకు ఎటువంటి నెంబర్  ప్లేట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నాడని మరో ఆరోపణ సైతం ఆ వ్యక్తిపై పోలీసులు నమోదు చేశారు. స్థానిక అరబిక్ దినపత్రిక ఎమరాత్ అల్ యుం తెలిపిన వివరాల ప్రకారం, ఆ యువకుడు అల్ షామిఖ ప్రాంతంలో పాఠశాల సమీపంలో చూపరుల సమూహం ఎదుట అపాయకరమైన సాహసకృత్యాలను చేయటానికి ఒక కారుని ఉపయోగించుకొన్నట్లు పేర్కొంది. తడి వాతావరణం కారణంగా,ఆ యువకుడు తన వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. ఈ సమయంలో ఈ విన్యాసాలను చూస్తున్న ఓ ప్రేక్షకుడిని కారు ఢీ కొట్టింది. ఆ యువకుని కారు  సాహసాల సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చెయ్యబడ్డాయి అటువంటి ప్రమాదకరమైన సాహసకృత్యాలను వాహనంతో చేయకూడదని పోలీసులు ఈ సందర్భంగా యువతకి సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com