ఉచిత డేటా,నిమిషాల పరిహారం చెల్లిస్తున్న ' డు '

- March 23, 2017 , by Maagulf
ఉచిత డేటా,నిమిషాల పరిహారం చెల్లిస్తున్న ' డు '

ఈ నెల 19 వ తేదీన ఆరు గంటల పాటు నెట్వర్క్ కోల్పోయిన వినియోగదారులకు టెలికాం సంస్థ పరిహారం అందచేయనుంచి. దుబాయ్ కు చెందిన టెలికాం సంస్థ ' డు ' సేవలు గత వారం 19 వ తేదీన నెట్వర్క్ దొరకక పోవడంతో ఇబ్బంది పాలైన వినియోగదారులకు ఉచిత డేటా మరియు నిమిషాల పరిహారం ఇస్తున్నట్లు గురువారం ప్రకటించింది.వినియోగదారుల సంతృప్తి మాకు ఒక కీలక ప్రాధాన్యతగా ఉంది, మేము నిరంతరంగా మా వినియోగదారులకు ఒక ఉన్నత స్థితిలో మా ప్రమాణాలు పెంచడానికి కృషి చేయనున్నట్లు తమ సేవలను ఉపయోగించుకొనేవారు తమ నెట్వర్క్ తో ఆనందించండి, మార్చి19 వ తేదీన కొన్ని మొబైల్ సేవలలో నెట్వర్క్ లభ్యత లేని కారణంగా పలువురు ప్రభావితం కాబడ్డారని డు వినియోగదారులకు ప్రశంసలతో కూడిన బహుమతిని పోస్ట్ పెయిడ్ వినియఁగదారులకు 2 జి బి  డేటా మరియు దేశంలో మాట్లాడుకునేందుకు 75 నిమిషాల ఉచిత టాక్ టైం,  మా ప్రీపెయిడ్ వినియోగదారులకు 2 జి బి  డేటా మరియు దేశంలోమాట్లాడుకునేందుకు 25 నిమిషాల ఉచిత టాక్ టైం అందిస్తున్నట్లు టెల్కో తెలిపింది.ఈ అవకాశాన్ని వినియోగదారులు, మార్చి 23 వ తేదీ నుండి 27 వ తేదీ  లోపున  5050 కు 'ఉచిత' ఎస్ఎంఎస్ ను పంపి ఆ సదుపాయం ను పొందాలని సంస్థ తెలిపింది. ప్రీపెయిడ్ వినియోగదారులకు అయితే పోస్ట్పెయిడ్ కస్టమర్లు ఏప్రిల్ నెలలో 30 రోజులు ఉచిత ఆఫర్ ని పొందవచ్చని తెలిపిపింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com