అష్గల్‌ సూచన: ట్రాఫిక్‌ మళ్ళింపు

- September 27, 2015 , by Maagulf
అష్గల్‌ సూచన: ట్రాఫిక్‌ మళ్ళింపు

పబ్లిక్‌ వర్క్స్‌ అథారిటీ అష్గల్‌ సంవత్సరం పాటు ట్రాఫిక్‌ మళ్ళింపుపై ప్రకటన విడుదల చేసింది. కొన్ని చోట్ల తాత్కాలికంగా మూసి వేత, మరికొన్ని చోట్ల తాత్కాలిక మళ్ళింపు వంటివి ఉంటాయని అష్గల్‌ వెల్లడించింది. సోమవారం నుంచి అమల్లోకి రానున్న తాత్కాలిక ట్రాఫిక్‌ మళ్ళింపు, మూసివేతలు ఏడాదిపాటు కొనసాగే అవకాశం ఉంది. అల్‌ అమీర్‌ స్ట్రీట్‌ నుంచి కస్‌ర్‌ రాయాన్‌ స్ట్రీట్‌ వరకూ సుమారు 800 మీటర్ల రహదారిపై ప్రయాణించేవారు సూచనల్ని పాటించాలి. ఈ రోడ్‌పై ట్రాఫిక్‌ని ఇతర మార్గాల్లోకి మళ్ళిస్తారు. అల్‌ రయాన్‌ రోడ్‌ను అల్‌ అమీర్‌ స్ట్రీట్‌ ద్వారా అల్‌ షమాల్‌ రోడ్‌ని ఓ బ్రిడ్జ్‌తో అనుసంధానం చేయవలసి రావడంతో ఆ పనుల కారణంగా ట్రాఫిక్‌కి ఇబ్బందులు తలెత్తనున్నాయి. వాహనదారులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా రోడ్‌ డైవర్షన్‌ని చేపట్టారు. ఇ రింగ్‌రోడ్‌, నజ్మా స్ట్రీట్‌ వెడల్పు పనులు కూడా చేపట్టనుంది అష్గల్‌. డ్రైనేజ్‌ నెట్‌వర్క్‌ని ఇంకా సమర్థవంతంగా చేపడ్తారు. అధునాతనమైన ల్యాండ్‌ స్కేపింగ్‌, స్ట్రీట్‌ లైటింగ్‌, పాదచారుల మార్గం వంటివాటిని అందుబాటులోకి తీసుకొస్తారు. ట్రాఫిక్‌ మళ్ళింపులు, తాత్కాలికంగా కొన్ని రోడ్ల మూసివేత వంటి చర్యలతో చిన్నపాటి ఇబ్బందులు వాహనదారులు ఎదుర్కోక తప్పదు. అయితే వాహనదారులకు మెరుగైన రోడ్లను అందుబాటులోకి తెచ్చేందుకే ఈ ప్రయత్నం జరుగుతుండడంతో అందరూ సూచనలని పాటించవలసి ఉంటుంది. రహదారి చిహ్నాలను అనుసరించి రోడ్డుపై వాహనాలను నడపడం ద్వారా అభివృద్ధి పనులు వేగంగా జరగడానికి సహకరించాలని వాహనదారుల్ని అష్గల్‌ కోరుతోంది. 

 

--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com