విజయవాడ 63 అడుగుల మహాగణపతి నిమజ్జనం ప్రారంభం
- September 27, 2015
నవ్యాంధ్రలో తొలిసారిగా 63 అడుగుల ఎత్తులో పూర్తిగా మట్టితో తయారు చేసిన మహాగణపతి విగ్రహ నిమజ్జనం కార్యక్రమం ప్రారంభమైంది. డూండి గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడలోని ఘంటశాల ప్రభుత్వ సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడి విగ్రహం 10 రోజులుగా పూజలందుకుంటోంది. ఉత్సవాల ముగింపు సందర్భంగా మహాగణపతిని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. విగ్రహంలో అంతర్గతంగా ఏర్పాటు చేసిన నీటి పంపుల ద్వారా నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. నిమజ్జనం కోసం మొత్తం లక్ష లీటర్ల నీటిని వినియోగించనున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







