‘ఊపెకుహ’ సినిమా లోగో ఆవిష్కరణ
- March 24, 2017
దర్శకుడు నిధి ప్రసాద్ రూపొందిస్తున్న కొత్త చిత్రం…’ఊపెకుహ ‘(ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి). జేబీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. రాజేంద్రప్రసాద్, సాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఊపెకుహ’ సినిమా లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…’ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అనేది వ్యంగ్యంగా మాట్లాడే మాట. దీన్ని క్లుప్తంగా మార్చి సినిమాకు టైటిల్ గా పెట్టుకోవడం కొత్తగా ఉంది. సినిమాలో అంతా పేరున్న నటీనటులే నటించారు. క్యారెక్టర్స్ అన్నీ సరదాగా మలిచారు దర్శకుడు. వినోదాత్మకంగా అల్లరిగా సాగుతుంటుంది సినిమా. కమర్షియల్ అంశాలు బాగా ఉంటాయి.’ అన్నారు.
నిర్మాత విక్రమ్ మాట్లాడుతూ… ‘సినిమా పరిశ్రమకు రాకముందు వ్యాపారంలో ఉన్నాను. నిధి ప్రసాద్ ను నమ్మి, ఆయన్ను ఒప్పించి సినిమా చేస్తున్నాము. నటీనటులు, సాంకేతిక నిపుణులు అంతా బాగా సహకరించారు. అందరినీ అలరించే చిత్రమవుతుంది.’ అన్నారు. దర్శకుడు నిధి ప్రసాద్ మాట్లాడుతూ…’నేను దర్శకత్వానికి దూరంగా ఉండి చాలాకాలమవుతోంది. ఇక ఇప్పుడు నువ్వు సినిమాలు తీయలేవని చాలా మంది నిరుత్సాహపరిచారు.
అయితే వాళ్లు చెప్పిన దానికి పరిశ్రమలోని పరిస్థితులకు సంబంధం లేదు. అంతా సహకరించారు. కథ పూర్తి అయిన తర్వాత నమ్మకం పెరిగి, మా కుటుంబ సభ్యులతోనే సినిమా చేశాను. అనుకున్న విధంగా సినిమా రావడం సంతోషంగా ఉంది. ‘ అన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







