చిరంజీవి బాలయ్యల పై సంచలన వ్యాఖ్యలు చేసిన సత్యనారాయణ
- March 24, 2017
కొన్ని దశాబ్దాలపాటు విభిన్న పాత్రలు పోషిస్తూ అందరి హీరోలతో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సృష్టించుకున్న విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ పేరును కూడా నేటి తరం సినిమా ప్రేక్షకులు మర్చిపోయారేమో అని అనిపించడం సహజం. అటువంటి సీనియర్ మోస్ట్ నటుడు ఈమధ్య ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి 'బాహుబలి' పై అదేవిధంగా చిరు - బాలయ్యల పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు.
ఇప్పుడు సత్యనారాయణ చేసిన కామెంట్స్ ఫిలింనగర్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుత సినిమా రంగం గురించి టాప్ హీరోల గురించి అనేక కామెంట్స్ చేసిన సత్యనారాయణను ఈ మధ్య చిరంజీవి నటించిన 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' బాలయ్య వందో మూవీ 'గౌతమీపుత్ర శాతకర్ణి' చూసారా అంటూ ఆ మీడియా సంస్థ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కైకాల సత్యనారాయణ నిర్మొహమాటంగా జవాబు చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు.
బాలయ్య తన 100వ సినిమా చూడాలంటూ రమ్మంని పిలిస్తే వెళ్లి చూశానని అయితే తనను చిరంజీవి తన సినిమా చూడమని పిలవలేదని థియేటర్ లో చూద్దామన్నా ఆ అరుపులు, గోలల మధ్య అర్థం కాదని షాకింగ్ కామెంట్స్ చేసాడు సత్యనారాయణ. ఇదే సందర్భంలో రాజమౌళి 'బాహుబలి' గురించి మాట్లాడుతూ ఒక్క గ్రాఫిక్స్ గొప్పతనం తప్ప ఆ సినిమాలో చెప్పుకోవడానికి మరే గొప్పతనం ఉంది అంటూ 'బాహుబలి' ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసాడు సత్యనారాయణ.
ఇదే సందర్భంలో తనకు ఎన్నో సినిమాలలో నటించినా తనకు పద్మశ్రీ అవార్డు రాని విషయం పై స్పందిస్తూ కేవలం పైరవీలు చేసుకుంటూ అందర్నీ కాకా పట్టుకుంటూ తిరిగే వారికి మాత్రమే ఇటువంటి ఆవార్డులు ఇస్తున్నారని అంటూ టాలీవుడ్ సినిమా రంగంలో ప్రస్తుతం ప్రతిభకు ఎక్కడ స్థానం ఉంది అని కామెంట్ చేసాడు కైకాల. ఎందరో టాప్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన సత్యనారాయణ లాంటి వ్యక్తులను కూడ సినిమా రంగం మర్చిపోయింది అంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం అవుతుంది..
తాజా వార్తలు
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ







