బీఎస్ఎఫ్కు తొలి మహిళా అధికారిణి
- March 25, 2017
ఉగ్రవాదం, దేశ సరిహద్దుల సంరక్షణలో భారత సరిహద్దు భద్రతా దళాలు(బీఎస్ఎఫ్) కీలక పాత్ర పోషిస్తాయి. 51 సంవత్సరాల తర్వాత తొలిసారిగా మహిళా బీఎస్ఎఫ్ అధికారిణిని నియమించారు. రాజస్థాన్‌లోని బికనీర్‌కు చెందిన తనుశ్రీ పరీక్ (25) బీఎస్ఎఫ్ అధికారిణిగా నియమితులయ్యారు. 2014 అర్హతా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తనుశ్రీ మహారాష్ట్రలోని తేనక్పూర్ బీఎస్ఎఫ్ అకాడమీలో 52వారాల శిక్షణ తీసుకున్నారు. శనివారంతో ఆమె శిక్షణకాలం ముగిసింది. అక్కడ నిర్వహించిన బీఎస్ఎఫ్ పాసింగ్ అవుట్ పరేడ్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తనుశ్రీను అభినందించి సన్మానించారు.
‘బీఎస్ఎఫ్లో మహిళా ఫీల్డ్ ఆఫీసర్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది అమ్మాయిలు బీఎస్ఎఫ్లో చేరాలని’ ఆయన ఆకాంక్షించారు. తనుశ్రీ పంజాబ్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దులో విధులు నిర్వర్తించనున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







