ఉగ్రవాదుల బీభత్సం జమ్ములో
- March 26, 2017
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు శనివారం రాత్రి బీభత్సం సృషించారు. ఒక తుపాకీని లాక్కెళ్లటంతో పాటు .. జైళ్ల శాఖ డీఎస్పీ ఇంట్లోకి చొరబడి పిల్లల్ని కొంత సేపు బందీలు చేసుకుని తర్వాత వదిలిపెట్టారు. అంతటితో ఆగకుండా డీఎస్పీ వాహనానికి నిప్పుపెట్టారు. ఎట్టకేలకు పోలీసులు ఒక ఉగ్రవాదిని అరెస్టు చేశారు.
తొలుత అంజుమన్ మిన్హాజ్ రసూల్ సంస్థ ఛైర్మన్ అయిన మౌలానా సయ్యద్ అతర్ దెహల్వీ వ్యక్తి.. భద్రతా అధికారి మహమ్మద్ హనీఫ్పై ఇద్దరు ఉగ్రవాదులు కారంతో దాడి చేశారు. తర్వాత అతని వద్ద ఉన్న ఏకే-47 రైఫిల్‌ను లాక్కెళ్లారు. ఈ విధంగా వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై దాడి చేసి రైఫిల్ లాక్కెళ్లటం వంటి సంఘటన గత ఇరవై ఏళ్లలో ఇదే ప్రథమం.
ఈ ఘటనలో గాయపడిన పోలీసు అధికారిని స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తరలించారు. అనంతరం పోలీసులు చేపట్టిన గాలింపు చర్యల్లో ఒక ఉగ్రవాది పోలీసులు పట్టుబడ్డాడు. మరో ఉగ్రవాది రైఫిల్‌తో పరారయ్యాడు.
బుగ్దామ్స్ ఛాదూరా ప్రాంతంలో జైళ్ల శాఖ డీఎస్పీ అబ్దుల్ భట్ ఇంట్లోకి చొరబడి ఇద్దరు కుమారులను ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్నారు. తర్వాత వారిని విడుదల చేశారు. భట్ వాహనానికి నిప్పుపెట్టారు. అతని కుటుంబాన్ని హత్య చేస్తామని బెదిరించారు. ఈ రెండు ఘటనలతో జమ్ముకశ్మీరులో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







