నటుడు కమల్‌హాసన్‌ చిక్కుల్లో

- March 26, 2017 , by Maagulf
నటుడు కమల్‌హాసన్‌ చిక్కుల్లో

నిత్యం వార్తల్లో వుంటున్నాడు నటుడు కమల్‌హాసన్. మహాభారతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కమల్‌హాసనపై బెంగళూరులో కేసు నమోదైంది. కర్ణాటకలోని బసవేశ్వర మఠాధిపతి ప్రణవానంద స్వామి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఓ తమిళ టీవీ ఛానెల్‌లో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కమల్‌ వ్యాఖ్యలు చేశారని, ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. హిందూమతాన్నే కాకుండా ముస్లిం, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేలా కమల్‌హాసన వ్యాఖ్యలు వున్నాయని, మూడురోజుల్లో క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com