'గురు' సినిమా కోసం చిరంజీవి సహకారాన్ని కోరిన వెంకీ
- March 27, 2017
ఈనెల 31న విడుదల కాబోతున్న 'గురు' సినిమా పై భారీ ఆసలు పెట్టుకున్నాడు వెంకటేష్. ఆ ఆశలకు ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి సహకారం కూడ తన 'గురు' సినిమాకు రావడంతో ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్నాడు వెంకీ. ఈ మూవీ కోసం టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, వెంకటేష్ కలుస్తున్నారు.
ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి మల్టీ స్టారర్ మూవీలో నటించకపోయినా బుల్లితెర పై ఈ వారం వీరిద్దరూ చిరంజీవి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో సందడి చేయబోతున్నారు. ఈ వారం విడుదల కాబోతున్న 'గురు' సినిమాను ప్రమోట్ చేయడానికి 'ఉగాది' రోజున ప్రసారం కాబోతున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి వెంకటేష్ అతిథిగా రాబోతున్నాడు.
ఈ షోలో 'గురు' సినిమా గురించి వెంకటేష్ పడిన కష్టం గురించి అనేక ఆసక్తికర విషయాలు చిరంజీవి నోటి వెంట చెప్పిస్తారని తెలుస్తోంది. పండుగరోజు ప్రసారమయ్యే కార్యక్రమం కాబట్టి ఈ షోకు మంచి రేటింగ్స్ వస్తాయని ఈ కార్యక్రమ నిర్వాహకులు భావిస్తున్నట్లు టాక్.
తన 75వ సినిమాకు అతి చేరువలో ఉన్న వెంకటేష్ ను అతడి కెరియర్ కు సంబంధించి అదేవిధంగా అతడితో నటించిన అనేకమంది హీరోయిన్స్ గురించి అనేక ఆసక్తికర ప్రశ్నలు చిరంజీవి ఈ కార్యక్రమంలో వెంకటేష్ ను అడగబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా నిన్న మొన్నటివరకు తగ్గతూ వచ్చిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో రేటింగ్స్ ఇప్పుడు నిలకడగా కొనసాడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
దీనితో ఈషో రేటింగ్స్ ను మరింత పెంచడానికి టాలీవుడ్ కు అదేవిధంగా దక్షిణాది సినిమా రంగానికి చెందిన చాలామంది ఫిలిం సెలెబ్రెటీలను ఈషోకు పిలిచే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు టాక్. వెంకీ ఎప్పీయరెన్స్ తో కోటీశ్వరుడు రేటింగ్స్ పెరుగుతాయా లేదంటే చిరంజీవి సహకారంతో 'గురు' సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయా ? అన్నది ఈ వారం తేలిపోతుంది..
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







