నైజీరియన్‌లపై దాడి కేసులో 10 మందిపై కేసు నమోదు

నైజీరియన్‌లపై దాడి కేసులో 10 మందిపై కేసు నమోదు

గ్రేటర్ నోయిడాలో నైజీరియన్‌లపై జరిగిన దాడి కేసుపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు సూచించారు. దాడిలో వంద మందికి పైగా ఉన్నారని, వారిలో 10 మంది ప్రధాన నిందితులుగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. మరోవైపు నైజీరియన్లపై దాడిని ఆ దేశ విద్యార్థుల సంఘం తీవ్రంగా ఖండించింది. సమస్యను పరిష్కరించేందుకు అధికారులతో సమావేశమయ్యారు నైజీరియన్ ప్రతినిధులు. నైజీరియన్లు సప్లై చేసిన డ్రగ్స్‌ తీసుకుని స్థానికుడు మృతి చెందాడంటూ ఆగ్రహించారు జనం. దీంతో దొరికిన వారిపై దొరికినట్లు కొట్టారు. 

Back to Top