బాలుడి చివరి కోరిక.. అమ్మ సమాధి పక్కనే పూడ్చిపెట్టండి..
- March 28, 2017
అమ్మకు క్యాన్సర్.. బిడ్డను కూడా ఆ ప్రాణాంతక మహమ్మారి వదిలిపెట్టలేదు. అమ్మ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. అయితే బిడ్డ ఆమె వెంటే వెళ్లిపోయాడు. కేన్సర్‌కు చికిత్స పొందుతున్న లండన్‌లోని ఆస్పత్రిలో మృతి చెందిన ఏడేళ్ల బాలుడి చివరి కోరిక విని ప్రపంచం కన్నీళ్లు పెట్టుకుంది. శుక్రవారం అమ్మతో పాటు శాశ్వతంగా ఈ లోకానికి దూరమైన ఫిలిప్ క్వాస్ని అనే ఏడేళ్ల బాలుడు చివరి కోరిక ఏంటో వింటే కంట నీరు రాక తప్పదు. క్యాన్సర్ బారిన పడిన ఆ బాలుడు తన తల్లి సమాధి పక్కనే తనను పూడ్చి పెట్టాలన్నాడు. అలా చేస్తే స్వర్గంలో ఉన్న అమ్మ తనను బాగా చూసుకుంటుందని చెప్పాడు. ఈ మాట విన్న అనేక హృదయాలు కరిగిపోయాయి. బాలుడి చివరి కోరిక తీర్చేందుకు ప్రపంచం ముందుకొచ్చింది.
2011తో ఫిలిప్ తల్లి ఎజ్నియెస్కా కూడా కేన్సర్‌తోనే మృతి చెందారు. తండ్రి పీటర్‌తో కలిసి ఉంటున్న ఫిలిప్‌కు కేన్సర్ సోకినట్టు గతేడాది సెప్టెంబరులో గుర్తించారు. బాలుడికి సోకిన జువెనైల్ మైలోమోనోసైటిక్ ల్యుకేమియా(జేఎంఎంఎల్) నుంచి రక్షించేందుకు వైద్యులు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే బాలుడి కోరిక తీర్చేందుకు 6500 పౌండ్లు అవసరం కాగా, దాతల ద్వారా 41వేల పౌండ్లు విరాళంగా అందాయి. చనిపోతాననే విషయం ఫిలిఫ్‌కు తెలుసునని.. తన చేతుల ద్వారా కుమారుడిని పూడ్చి పెట్టాల్సి వస్తుందని ఊహించలేకపోయానని పీటర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫిలిప్ చివరి కోరిక తీర్చేందుకు ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







