మీ ప్రేమకు కృతజ్ఞతలు: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌

- March 28, 2017 , by Maagulf
మీ ప్రేమకు కృతజ్ఞతలు: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌

శ్రీలంకలో నివసిస్తున్న తమిళులకు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ లేఖ రాశారు. ‘మీడియా ద్వారా మీ అందరి ప్రేమను నాకు తెలియజేశారు. మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయతల గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మంచి జరగాలని అందరూ కోరుకుందాం. ఆ నమ్మకంతోనే ఉందాం. సరైన సమయం వచ్చినపుడు మనందరం కలుసుకుందాం. ఎల్లప్పుడూ మీరు శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ ఉంటాను’ అంటూ రజనీకాంత్‌ లేఖలో పేర్కొన్నారు. లంకలో తమిళ నిర్వాసితుల కోసం జ్ఞానం ఫౌండేషన్‌ నిర్మించిన 150 ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏప్రిల్‌ 9న రజనీకాంత్‌ వెళ్లాల్సి ఉంది. కానీ కొన్ని తమిళ సంఘాలు ఆందోళన చేయడంతో తన శ్రీలంక పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ విషయాన్ని ఎవరూ రాజకీయం చేయొద్దని రజనీ కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com