హెచ్‌ఐసీసీలో వేడుకగా 'ఐఫా ఉత్సవం'

- March 29, 2017 , by Maagulf

తారల మెరుపులు.. నృత్యాల మైమరపులు.. ప్రయోక్తల పదవిరుపులతో ఫార్చూన సనఫ్లవర్‌ ఆయిల్‌ 'ఇంటర్నేషనల్‌ ఇండియన ఫిల్మ్‌ అకాడమీ (ఐఫా) ఉత్సవం 2017' హెచ్‌ఐసీసీలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మంగళవారం తొలి రోజు తమిళ, మలయాళ భాషా సినిమాలకు సంబంధించి అవార్డులను ప్రదానం చేశారు. తమిళ సినీ అవార్డుల ప్రదానానికి తెలుగు నటుడు రానా, తమిళ నటుడు శివ, మలయాళ సినీ అవార్డులకు మలయాళ నటుడు టిని టామ్‌, నటి పియర్లే మానే ప్రయోక్తలుగా వ్యవహరించారు.

వేదికపైకి రానా మోపెడ్‌పై రాగా, మలయాళ ప్రయోక్తలు కారులో వచ్చారు. మలయాళ విభాగంలో ఉత్తమ నేపథ్య గాయని అవార్డు ప్రదానంతో కార్యక్రమం మొదలైంది. తమిళ హీరో జీవా, హీరోయిన్లు హన్సిక, అక్షరా హాసన, నిక్కీ గల్‌రాణి తదితరుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఈ ఉత్సవంలో ఆస్కార్‌ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షనగా నిలిచారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత సతీమణి లత, తమిళ సీనియర్‌ డైరెక్టర్‌ పి.వాసు, ఆస్కార్‌ అవార్డీ.. ఛాయాగ్రాహకుడు రసూల్‌ పోకుట్టి, తమిళ నటులు నాజర్‌, 'జయం' రవి, ప్రసన్న, సీనియర్‌ నటీమణులు రాధిక, అంబిక, స్నేహ, శ్రీదేవి (మంజుల కుమార్తె), నేటి తరం తారలు సురభి, అదాశర్మ, నీతూ చంద్ర, సయేషా సైగల్‌, గౌరీ ముంజల్‌, శివబాలాజీ - స్వప్నమాధురి దంపతులు, 'పెళ్లిచూపులు' ఫేమ్‌ ప్రియదర్శి హాజరయ్యారు. వీరే కాకుండా పలువురు తమిళ, మలయాళ సినీ రంగాలకు చెందిన తారలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

తెలుగు చిత్రసీమకు చెందిన కొంతమంది దర్శకులు, నిర్మాతలు కూడా ఈ వేడుకకు వచ్చారు. సాధారణంగా తారలు వచ్చే మార్గంలో రెడ్‌ కార్పెట్‌ వేయడం ఆనవాయితీ. దానికి భిన్నంగా ఈ ఉత్సవంలో గ్రీన కార్పెట్‌ను వినియోగించారు. బుధవారం రెండో రోజు జరిగే వేడుకలో తెలుగు, కన్నడ సినీ అవార్డులను అందజేయనున్నారు. ఈ వేడుకకు తెలుగు నుంచి రానా, నాని, కన్నడం నుంచి అకుల్‌ బాలాజీ, మేఘనా గోవంకర్‌ ప్రయోక్తలుగా వ్యవహరిస్తారు.

మొదటిరోజు అవార్డు గ్రహితల లిస్ట్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com