దుబాయ్ లో అనుపమ మోహన్ చే కూచిపూడి నాట్యాభివృద్ధి వర్క్ షాప్
- March 29, 2017

పద్మభూషణ్ డా. వెంపటి చిన్న సత్యం గారి శిష్య బృందం లో ప్రఖ్యాతి గాంచిన నాట్య విశారద అనుపమ మోహన్ గారు కేరళ రాష్ట్రం లో స్థిరపడి ఆ రాష్ట్రం లో కూచిపూడి నాట్యాన్ని అభివృద్ధి చేస్తున్నారు. సత్యాంజలి అకాడమీ అఫ్ కూచిపూడి డాన్స్ ని స్థాపించి ఎంతో మంది శిష్యులను తీర్చి దిద్దుతున్నారు. సంవత్సరానికి రెండు డాన్స్ ఫెస్టివల్స్ మరియు పలు చోట్ల ఎన్నో వర్క్ షాప్స్ నిర్వహిస్తూ శ్రీమతి అనుపమ మోహన్ కూచిపూడి నాట్యాన్ని పలుదిశల అభివృద్ధి చేస్తూ భావితరాలకు అందిస్తున్నారు. ఇందులో భాగం గా అనుపమ మోహన్ ఇటీవలే దుబాయ్ లో మార్చ్ 17 నుంచి 27 వరకు (8 వర్కింగ్ డేస్) కూచిపూడి నాట్యాభివృధి వర్కుషాప్ నిర్వహించారు. సీనియర్స్ మరియు జూనియర్స్ బ్యాచెస్ గా పిల్లలకు అడవు, జాతి లు మరి రెండు శాస్త్రీయ నృత్యాలు నేర్పారు.
ఈ సందర్బంగా శ్రీమతి పద్మజ మాట్లాడుతూ మా అమ్మాయి కృష ఈ వర్కుషాప్ వల్ల ఎంతో లబ్ది పొందింది. కూచిపూడి నాట్యం లో మెలుకువలు తెలుసుకుంది అని తెలిపారు. అనుపమ మోహన్‌కి కృతఙ్ఞతలు తెలిపారు. కేరళ రాష్ట్రం వారు మన కూచిపూడి కళ పట్ల ఎంతో ఆసక్తి చూపించటం నాకు చాలా సంతోషంగా అనిపించింది. మన తెలుగు వారు కూడా మన పిల్లలకి కూచిపూడి కళ పట్ల ప్రోత్సహిస్తూ పిల్లలకు నేర్పించి, మన శాస్త్రీయ నృత్యాన్ని విస్తరించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వాహుకురాలు శ్రీమతి. సంధ్యని అభినందించారు.
ఈ కార్యక్రమం లో పాల్గున్న వారు పవిత్ర, నీహారిక, నివేదిత,విష్ణుప్రియ, గాయత్రి, లక్ష్మి,
మీనాక్షి, హ్రితిక, సాత్విక, సర్గా, సరితా, మాళవిక, సంధ్య, క్రిష.


తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







