ఆసుపత్రి నుండి దాసరి డిశ్చార్జ్
- March 29, 2017
దర్శకరత్న దాసరి నారాయణరావు గత కొన్ని నెలలుగా హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యతో జనవరి 29న ఆసుపత్రి లో చేరిన దాసరికి చెస్ట్ ఆపరేషన్ చేసారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకోవడం తో నిన్న సాయంత్రం ఆసుపత్రి నుండి ఆయను డిశ్చార్జ్ చేసారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారని, ఆరోగ్యం బాగుందని, ఇక ఎలాంటి సమస్య ఉండదని అక్కడి వైద్యులు అధికారికంగా తెలిపారు.
అలాగే ఆయన ఇకపై పూర్తి ఆరోగ్యంతో ఉండాలని కిమ్స్ ఎండీ, ఇన్నాళ్లు దాసరి ఆరోగ్యాన్ని పర్యవేక్షించిన ప్రధాన వైద్యుడు డా.
బి. భాస్కర్ రావు తెలిపారు. డిస్చార్జ్ వెంటనే దాసరి జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, పలువురు సినీ ప్రముఖులు ఆయన్ను కలిసి పరామర్శించి హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







