అక్వా పార్క్‌ 'తక్కువలో ఎక్కువ ఆనందం'

- March 29, 2017 , by Maagulf
అక్వా పార్క్‌ 'తక్కువలో ఎక్కువ ఆనందం'

ఆక్వా పార్క్‌ ఖతార్‌, గురువారం 2017 సీజన్‌ సందర్శకుల కోసం ఆహ్వానం పలుకుతోంది. అన్ని వయసులవారికీ ఆహ్లాదాన్నిచ్చేలా సరికొత్త ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు. 100 ఖతారీ రియాల్స్‌ నుంచి ఈ ప్యాకేజీలు ఉంటాయి. గత ఏడాదితో పోల్చితే ప్యాకేజీ ధరల్ని చాలావరకు తగ్గించారు. ఆక్వా పార్క్‌కి వచ్చే ప్రతి వినియోగదారుడూ మెచ్చేలా ఈ ప్యాకేజీలను రూపొందించారు. ఖతార్‌లో తొలిసారిగా స్టింగ్రే సర్ఫింగ్‌ మెషీన్‌ పర్యాటకుల్ని అలరించనుంది. బూమరాంగో, స్పేస్‌ బోట్‌ సహా పదికి పైగా స్పెషల్‌ ఎట్రాక్షన్స్‌ని తక్కువ ధరలోనే పర్యాటకులకు అందిస్తున్నారు. రగ్‌డ్‌ టాక్సిక్‌ ర్యాంపేజ్‌ ఈ వారాంతంలో స్పెషల్‌ ప్యాకేజీగా సందర్శకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేయనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com