యువతీ మృతికి కారకుడైన జిసిసి వ్యక్తికి 200,000 క్యూ ఆర్ రక్త పరిహారం
- April 02, 2017
రోడ్డుపై దృష్టి నిలపక అడ్డదిడ్డంగా వాహనాలను నడిపేవారికి దోహా న్యాయస్థానం ఓ ఝలక్ ఇచ్చింది. నిర్లక్ష్యంగా ద్విచక్రవాహనం నడిపి తన ముందు మరో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఒక యువతిని ఢీ కొట్టి ఆమె మరణానికి కారణమైన జీసీసీ వ్యక్తికి దోహా క్రిమినల్ న్యాయస్థానం10, 000 కతర్ రియాళ్ళు జరిమానా విధించి ఆ యువతీ కుటుంబానికి రక్త పరిహారం కింద మరో 200,000 కతర్ రియాళ్ళు చెల్లించాలని ఆదేశించింది.మరణించిన ఆ యువతీ సి లైన్ ఏరియాలో తన క్వాడ్ బైక్ మీద నెమ్మదిగా వెళుతుండగా...వెనుక నుండి నిర్లక్ష్యంగా మరో ద్విచక్ర వాహనంపై వస్తున్న జీసీసీ వ్యక్తి ఆ యువతీ క్వాడ్ బైక్ ను అత్యంత వేగంగా.' డీ ' కొట్టాడు. దీనితో ఆ యువతీ తన ద్విచక్ర వాహనం పై నుంచి గాలిలోనికి ఎగిరి మరో కారుని బలంగా తాకింది. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణం కోల్పోయింది. ఈ కేసులో మరణించిన యువతీ యొక్క చట్టపరమైన వారసులకు 200, 000 కతర్ రియళ్ళ రక్తపరిహారం చెల్లించాలని ప్రతివాదికి గౌరవనీయ కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







