78 కిలోల దొంగ బంగారం విశాఖ విమానాశ్రయంలో
- April 03, 2017
కస్టమ్స్ కమిషనర్ బి హరేరామ్ వెల్లడి
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో గత ఏడాది (2016-17) 78 కిలోల దొంగ బంగారాన్ని స్వాధీ నం చేసుకున్నట్టు కస్ట మ్స్ కమిషనర్ బి హరేమార్ తెలిపారు. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.4,609 కోట్ల ఆదాయాన్ని సాధించామని సోమవారం ఆయన చెప్పారు. వాస్తవానికి సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు రూ.4,468 కోట్లు లక్ష్యంగా నిర్దేశించగా.. అంతకు 4.28 శాతం ఎక్కువ నమోదు చేశామన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఆదాయంలో 16.39 శాతం వృద్ధి సాధించామన్నారు. విశాఖ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న వివిధ వస్తువుల ద్వారా రూ.22.42 కోట్లు రాబట్టామన్నారు.
పన్ను చెల్లించని వారి నుంచి రూ.4.01 కోట్లు వసూలు చేశామన్నారు. వ్యాపార వర్గాలకు రూ.659 కోట్లు రిఫండ్ చేశామన్నారు. గత ఏడా ది కంటే ఈ మొత్తం 53 కోట్లు అధికమని వివరించారు. ఎగుమతి, దిగుమతుల వ్యాపార వేగవంతానికి త్వరగా క్లియరెన్సలు ఇస్తున్నామని, సరుకు దిగుమతికి సగటున 2.37 రోజులు, ఎగుమతికి 2.85 రోజులు తీసుకుంటున్నామన్నారు.
తాజా వార్తలు
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!







