సాయం చేయమంటూ కోరిన ట్వీటుకు స్పందించిన ఎంపీ కవిత
- April 04, 2017
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్ ఎంపీ కవితకు ఓ యువకుడు ఆదుకోమంటూ ట్వీట్ చేశాడు. వివరాల్లోకి వెళితే 2014లో బతుకమ్మ పండుగ సందర్భంగా పూల కోసమని వెళ్ళి విద్యుత్ షాక్ తగిలి రెండు కాళ్ళు పోయాయి. ఆర్థిక సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కి దరఖాస్తు చేసుకున్నాడు. ట్రీట్మెంట్ కోసం ఇప్పటివరకు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. ఈసీఈ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన శేఖర్ తనకు ప్రభుత్వ ఉద్యోగాన్ని వికలాంగుల కోటాలో ఇప్పించగలరని మనవి చేసుకున్నాడు. కానీ ఇంతవరకూ ఎటువంటి సాయం అందలేదు. తక్షణమే స్పందించిన కవిత వివరాలు పంపమంటూ రీట్వీట్ చేశారు. ఆదుకుంటానని భరోసానిచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







