ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి మళ్లీ నంది అవార్డుల పండగ
- April 05, 2017
నంది అవార్డుల వేడుక మళ్లీ కనువిందు చేయనుంది. 2012, 2013 సంవత్సరములకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 2014, 15, 16 సంవత్సరాల నంది అవార్డులూ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయడానికీ, త్వరలోనే మూడు సంవత్సరాలకు గానూ అవార్డుల ఎంపిక పూర్తి చేయడానికి కసరత్తులు మొదలయ్యాయి. మరో విశేషం ఏమిటంటే... ఈ ఐదేళ్ల నంది అవార్డులను ఒకేసారి, ఒకే వేదికపై ఇవ్వబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి యేటా నంది అవార్డుల్ని ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. 1963 నుంచీ ఇదో ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2012 నుంచీ అవార్డుల సంగతిని ప్రభుత్వం పట్టించుకోలేదు.
తెలంగాణ ప్రభుత్వం ‘సింహా’ అవార్డుల పేరిట పురస్కారాల్ని ఇవ్వాలని నిర్ణయించుకొన్న నేపథ్యంలో, ‘నంది’ ఆంధ్రప్రదేశ్‌కే ఉండిపోయింది. ఎప్పుడైతే ఎవరి అవార్డులు వారివి అనే ఆలోచన వచ్చిందో, అప్పుడే ఏపీ ప్రభుత్వం నంది అవార్డులపై కసరత్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా 2012, 13 నంది అవార్డుల విజేతల పేర్లు ప్రకటించారు. త్వరలోనే నాలుగేళ్ల అవార్డులకు సంబంధించిన ప్రక్రియ మొదలవుతుంది.
మరోవైపు నంది అవార్డుకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. అందుకే... ఈసారి అవార్డు వేడుక అంగరంగ వైభవంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొంది. అందులో భాగంగా రెండు రోజుల పాటు ఈ వేడుకల్ని నిర్వహించబోతున్నార్ట.
అవార్డులు ఎక్కడ ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వాలి? అనే విషయంలో ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. నందితో పాటు ఎన్టీఆర్ జాతీయ అవార్డు, బిఎన్‌రెడ్డి జాతీయ అవార్డు, నాగిరెడ్డి, చక్రపాణి జాతీయ అవార్డు, రఘపతి వెంకయ్య చలన చిత్ర అవార్డులూ కూడా ఒకేసారి అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
2012, 2013 సంవత్సరాలకు గానూ ఆ అవార్డు గ్రహీతల వివరాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఎస్.పి.బాలసుబ్రమణ్యం (ఎన్టీఆర్ జాతీయ అవార్డు 2012), హేమమాలిని (ఎన్టీఆర్ జాతీయ అవార్డు 2013), సింగీతం శ్రీనివాసరావు (2012 బిఎన్‌రెడ్డి జాతీయ అవార్డు), కోదండరామిరెడ్డి (2013 బిఎన్‌రెడ్డి జాతీయ అవార్డు), దగ్గుబాటి సురేష్ బాబు (2012 నాగిరెడ్డి, చక్రపాణి అవార్డు), దిల్‌రాజు (2013 నాగిరెడ్డి, చక్రపాణి అవార్డు), కోడి రామకృష్ణ (2012 రఘుపతి వెంకయ్య అవార్డు), వాణిశ్రీ (2013 రఘపతి వెంకయ్య అవార్డు) లకు పురస్కారాలు అందజేయనున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







