పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఆత్మాహుతి దాడి
- April 05, 2017
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆర్మీ వాహనం సమీపంలో ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు సైనికులు సహా ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. మరో 14 మంది గాయపడినట్లు పాక్‌లోని పంజాబ్ రాష్ట్ర అధికార ప్రతినిధది మాలిక్ అహ్మద్ ఖాన్ వెల్లడించారు. సమాచారమందుకున్న సహాయక బృంద సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుని విస్త్రత తనిఖీలు చేపట్టారు.
ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే దాడిపై ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ నుంచి ప్రకటనలు వెలువడలేదు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







