వార్షిక ఇన్వెస్ట్‌మెంట్ మీటింగ్‌లో పాల్గొన్నఎపిఇడిబి
- April 06, 2017
దుబాయ్‌లో ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ - వార్షిక ఇన్వెస్ట్‌మెంట్ మీటింగ్ (ఎఐఎమ్) వద్ద ఆంధ్రప్రదేశ్ లాంజ్‌ని ప్రారంభించింది. ఇన్వెస్టర్లు, ఏజెన్సీస్ మరియు ప్రభుత్వాల మధ్య అనుసంధానం కోసం ఈ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడ్తుంది. ఆంధ్రప్రదేశ్ లాంజ్, పలు సెక్టార్స్‌కి చెందిన ఇన్వెస్టర్స్‌ని విశేషంగా ఆకర్షించింది. ఇరువర్గాలకీ లాభదాయకంగా ఉండే అనేక ప్రాజెక్టులకు సంబంధించి ఈ మీటింగ్‌లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఎపిఇడిబి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె.కృష్ణ కిషోర్‌తో ఇన్వెస్టర్లు సంప్రదింపులు జరిపి, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, పెట్టుబడిదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆంధ్రప్రదేశ్‌లో ఇన్వెస్టర్లకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని కృష్ణ కిషోర్, పెట్టుబడిదారులకు వివరించారు. వివిధ రంగాలకు చెందిన ఇన్వెస్టర్లు, అలాగే యూఏఈకి చెందిన ప్రముఖులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. 2017 ఎయిమ్ అత్యద్భుతంగా జరిగిందని నిర్వాహకులు తెలిపారు.




తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







