మిడిల్ ఈస్ట్‌ అశాంతి పట్ల ఎమిర్‌ షేక్‌ ఆందోళన

- September 29, 2015 , by Maagulf
మిడిల్ ఈస్ట్‌ అశాంతి పట్ల ఎమిర్‌ షేక్‌ ఆందోళన

ఎమిర్‌ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమాద్‌ అల్‌ థనీ, పాలస్తీనాలో పరిస్థితుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి చర్చలకు ఆస్కారం లేకపోవడం పట్ల ఆయన ఆవేదన చెందారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం జనరల్‌ అసెంబ్లీ 70వ సెషన్‌లో మాట్లాడుతూ, పాలస్తీనాలో ఆందోళనకర పరిస్థితులు ప్రపంచానికి సవాల్‌గా మారే అవకాశం ఉందని అన్నారు. ఈ ఉద్రిక్తతలు ఈ తరంతో ఆగిపోవాలని, భావి తరాలకూ ఈ ఉద్రిక్తతలు పాకకూడదని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్‌, పాలస్తీనాల మధ్య శాంతి కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని, రెండు దేశాలూ కూర్చుని చర్చించుకుని, సమస్యకు పరిష్కారం వెతికేలా ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకురావాలన్నారు ఎమిర్‌ షేక్‌. మతం, ప్రాంతం వంటి సున్నిత అంశాల్ని ఆధారంగా చేసుకుని తీవ్రవాదం పెచ్చరిల్లడం మానవాళికి ముప్పుగా పరిణమిస్తుందని ఎమిర్‌ షేక్‌ చెప్పారు. సిరియన్‌ సంక్షోభాన్ని సకాలంలో నివారించలేకపోవడం ప్రపంచానికి ఎలాగైతే ముప్పుగా మారిందో, పాలస్తీనా సమస్య కూడా అలాగే తయారువుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు ఎమిర్‌ షేక్‌. ఇరుగు పొరుగు దేశాల మధ్య సఖ్యత అవసరమనీ, ఇరాన్‌తో సత్సంబంధాలను తాము కోరుకుంటున్నామనీ, అలాగే ఖతర్‌తోనూ సత్సంబంధాలను కలిగి ఉన్నామనీ, గల్ఫ్‌ దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని ఎమిర్‌ షేక్‌ వివరించారు.

 

--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com